దూరదర్శన్​ లో 1954కుంభమేళా వీడియో ప్రదర్శన

1954 Kumbh Mela video screening on Doordarshan

Jan 15, 2025 - 15:33
 0
దూరదర్శన్​ లో 1954కుంభమేళా వీడియో ప్రదర్శన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 1954లో జరిగిన కుంభమేళా ఉత్సవాల వీడియోనూ జాతీయ దూరదర్శన్​ ఛానల్​ విశేషాలను పంచుకుంది. ఆనాటి వీడియోలతో కూడిన చిత్రప్రదర్శనను బుధవారం విడుదల చేసింది. ఈ వీడియోలో అప్పటి సీఎం పండిత్​ గోవింద్​ వల్లభ్​ పంత్​ మేళా ప్రాంతాన్ని సందర్శించి భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. త్రివేణి సంగమంలో బోటులో పర్యటించారు. మేళాకు హాజరైన భక్తులకు పలు విజ్ఞప్తులు అందజేశారు. లౌడ్​ స్పీకర్లను ఏర్పాటు చేశారు. పోలీసులు వైర్​ లెస్​ సెట్లను ఉపయోగించి భద్రతను పర్యవేక్షించారు. అశ్విక దళం భద్రతలో ప్రధాన పాత్ర పోషించింది. తప్పిపోయిన వారికోసం లౌడ్​ స్పీకర్ల ద్వారా ఒక నిర్దిష్ఠ ప్రాంతానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. 70 ఏళ్ల క్రితం వీడియోను దూరదర్శన్​ ప్రసారం చేయడం పట్ల పలువురు ఔరా అని వీక్షిస్తూ సోషల్​ మాధ్యమంగా పోస్టులు పెడుతున్నారు.