అఖిలేష్​ పై యూపీ సీఎం యోగి ఆగ్రహం

UP CM Yogi is angry with Akhilesh

Feb 18, 2025 - 14:03
 0
అఖిలేష్​ పై యూపీ సీఎం యోగి ఆగ్రహం

లక్నో: తమ పిల్లలను మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదివించి రాష్ర్టంలో చదివే బాలబాలికలకు ఉర్దూ బోధించాలని అఖిలేష్​ కోరుకుంటున్నారా? అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ నిలదీశారు. మంగళవారం రాష్ర్ట అసెంబ్లీలో బడ్జెట్​ సమావేశాల ప్రారంభంలో ప్రతిపక్ష పార్టీల నిరసనలు, ఆందోళనలకు సమాధానమిచ్చారు. ఎస్పీ అధినేత అఖిలేష్​ పై విరుచుకుపడ్డారు. ప్రజాసమస్యలను సానుకూల చర్చలు జరగాల్సిన సభలో నిరసనలు, ఆందోళనలు ఎందుకని నిలదీశారు. దేశభాష హిందీలో పిల్లలు చదివితే అభ్యంతరమేంటని నిలదీశారు. ఉర్దూ నేర్పి పిల్లలను మౌల్వీలుగా చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రాంతీయ భాషను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. అమ్మభాషను అందరూ గౌరవించాల్సిందే అన్నారు. అయినా ప్రతిపక్షాల నిరసనలు తగ్గకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి.