ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లకు గాయాలు

Two jawans injured in IED blast

Feb 4, 2025 - 19:07
 0
ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లకు గాయాలు

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ లో నక్సల్స్​ వ్యతిరేక ఆపరేషన్​ లో ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మంగళవారం జరిగిన ఈ పేలుడు వివరాలను ఉన్నతాధికారి మీడియాకు వివరించారు. నక్సల్స్​ కోసం కూంబింగ్​ కొనసాగుతుండగా ఒక సైనికుడు ఐఈడీపై కాలు మోపాడన్నారు. అది పేలిపోయిందన్నారు. దీంతో సైనికులకు గాయాలయ్యాయని వారిని రాయ్​ పూర్​ లోని  నారాయణ్​ ఆసుపత్రికి తరలించి చికిత్సనందింపచేస్తున్నట్లు వివరించారు. భద్రతా దళాల కోసమే నక్సలైట్లు ఐఈడీని అమర్చినట్లు తెలిపారు. గాయపడిన వారిని డీఆర్జీ కానిస్టేబుల్​ విజయ్​ కుమార్​ (26), సీఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ కుమార్​ (42)లుగా తెలిపారు. కాగా సోమవారం అర్థరాత్రి బీజాపూర్​ లోని టారెమ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బుగ్డి చెరు గ్రామంలో నక్సల్స్​ ఇద్దరు గ్రామస్థులను చంపారు. పదునైన కత్తితో వీరి గొంతుకలను కోసి హత్య చేశారు. మావోయిస్టుల సమాచారాన్ని బయటపెట్టారనే అనుమానంతో వీరిని చంపినట్లుగా పోలీసులు తెలిపారు.