ఒత్తిడి ప్రయత్నాలను రాజ్యాంగబద్ధంగా తిప్పికొట్టాం
సీఈసీ రాజీవ్ కుమార్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు ముందు తమపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని ఈసీ తెలిపింది. ఆప్, ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఈసీ ప్రధాన కమిషనర్ సామాజిక మాధ్యమంలో మంగళవారం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం పదే పదే, ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్నాయన్నారు. అయినా ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా, తెలివిగా, ఓపికగా వారి వారి ప్రభావాలకు లోనుకాకుండా నిర్ణయాలను తీసుకుందని తెలిపారు. కాగా ఈసీపై ఒత్తిడి తీసుకువచ్చిన ప్రయత్నాలు ఎవరు చేశారనే దానిపై కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేయలేదు.