బాలాఘాట్ లో ఎన్ కౌంటర్ ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి
Three women Naxalites killed in encounter in Balaghat

భోపాల్: మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. బుధవారం చత్తీస్ గఢ్ సరిహద్దుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో యాంటీనక్సల్స్ హాక్ ఫోర్స్ ఆపరేషన్ లో వీరిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో స్థానిక పోలీసు బృందాలు కూడా పాల్గొన్నాయని అడిషనల్ పోలీస్ కమిషనర్ విజయ్ దాబర్ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి 90 కి.మీ. దూరంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. నక్సల్స్ నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతుందన్నారు.