మహాకుంభమేళాలో 51.19 కోట్ల మంది పుణ్య స్నానాలు
51.19 crore people took holy bath in Mahakumbha Mela

లక్నో: మహాకుంభమేళాలో 51.19 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. శనివారం ఒక్కరోజే 1.08 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 11 రోజులు మిగిలి ఉండడంతో మరో పది కోట్ల వరకు పుణ్య స్నానాలు చేసే వారి సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంలో 650 చార్టెడ్ విమానాలు 34 రోజుల్లో రాకపోకలు సాగించాయి. ఇవిగాక మరో 300 బోయింగ్ విమానాలు ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా నడిచాయి. ఇది ప్రపంచ రికార్డుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ లో విమానాలు నిలిపేందుకు కూడా స్థలం సరిపోవడం లేదన్నారు.
కాగా శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఎమ్మెల్యే హర్షవర్ధన్ వాజ్ పేయి, నితేష్ రాణే సంగమంలో స్నానం చేశారు.
పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య..
– 13 జనవరి మాఘ పూర్ణిమ రోజు 1.70 కోట్ల మంది
– 14 జనవరి మకర సంక్రాంతి 3.50 కోట్ల మంది
– 15 నుంచి 28 జనవరి 14 రోజుల్లో 13.8 కోట్ల మంది
– 29 జనవరి మౌనీ అమావాస్య 7.64 కోట్ల మంది
– 3 జనవరి నుంచి 2 ఫిబ్రవరి నాలుగు రోజుల్లో 8.29 కోట్ల మంది
– 3 ఫిబ్రవరి బసంత్ పంచమి 2.57 కోట్ల మంది
– 4 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 8 రోజుల్లో 8.41 కోట్ల మంది
– 12 ఫిబ్రవరి మాఘ పూర్ణిమ 2 కోట్ల మంది
– 13 నుంచి 14 ఫిబ్రవరి రెండు రోజుల్లో 2.15 కోట్ల మంది
– 15 ఫిబ్రవరి సాయంత్రం 4 గంటల వరకు 1.08 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.