వక్ఫ్​ బోర్డు ఉన్నట్లే సనాతన బోర్డు ఉండాల్సిందే

ఆధ్యాత్మిక వేత్త దేవకీనందన్​ ఠాకూర్​

Jan 4, 2025 - 14:42
 0
వక్ఫ్​ బోర్డు ఉన్నట్లే సనాతన బోర్డు ఉండాల్సిందే

బెంగళూరు​: దేశంలో వక్ఫ్​ బోర్డు ఉన్నప్పుడు సనాతన బోర్డు ఎందుకు ఎండకూడదని ఆధ్యాత్మిక వేత్త దేవకీనందన్​ ఠాకూర్​ ప్రశ్నించారు. ఈ విషయంలో అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని శంకరాచార్య అధ్యక్షతన సనాతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. శనివారం బెంగళూరు ఆలయ సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని దేవకీనందన్​ ప్రసంగించారు. ఆలయాలను ప్రభుత్వాల నియంత్రణ నుంచి పూర్తిగా విముక్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి ఆలయం నుంచి ప్రతీయేటా రాష్ర్ట ప్రభుత్వానికి రూ. 500 కోట్లు సమకూరుతుందన్నారు. ఈ మొత్తం దేనికి వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. ఆలయాల్లో సమకూరిన డబ్బుతో మతమార్పిళ్లు జరుగుతున్నాయని అనుమానాన్ని వ్యక్తం చేశారు. సనాతన బోర్డు త్వరలో ఏర్పాటు చేయకుంటే సంభాల్​ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. దేవాలయాలను రక్షించుకోవడానికి భక్తులు పూలమాలలతోపాటు ఈటెలను కూడా పట్టుకోవాల్సిన పరిస్థితులను ప్రభుత్వాలు కల్పించొదన్నారు. హిందువులపై, దేవాలయాలపై దాడులను ఇక సహించబోమని తమ హక్కులను తామే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని దేవకీనందన్​ ఠాకూర్​ అన్నారు.