కూటమి విచ్చిన్నం.. ఒంటరిగానే పోటీ
The alliance is broken.. The competition is alone

శివసేన (యూబిటీ) సంజయ్ రౌత్
ముంబాయి: మహారాష్ట్ర శివసేన (యూబిటీ), ఇండియా బ్లాక్, మహావికాస్ అఘాడి కూటమి విచ్ఛిన్నమైంది. కూటమిగా వెళితే వ్యక్తిగతంగా అవకాశాలు లభించడం లేదని, అందుకే ముంబాయి, థానే, నాగ్ పూర్ తోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కౌన్సిల్, పంచాయితీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దవ్ ఠాక్రే నిర్ణయాన్ని వెల్లడించారు. కూటమి రాజకీయ పార్టీల సంస్థాగత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు దక్కడం లేదన్నారు. అదీగాక ఎంవీఏ మహారాష్ర్ట అసెంబ్లీలో పరాజయంపై కాంగ్రెస్ నాయకడు విజయ్ వాడెట్టివార్ నిందలు సరికాదన్నారు. రాజీపై నమ్మకం లేని వారితో కూటమిలో ఉండబోమన్నారు. కనీసం కూటమికి కన్వీనర్ ను కూడా నియమించుకోలేదన్నారు. కూటమిలో అతిపెద్ద పార్టీ తమదేనన్నారు. కనీసం సమావేశానికి పిలవాల్సిన బాధ్యతను కూడా కాంగ్రెస్ విస్మరించిందని ఆరోపించారు. వ్యవసాయం, కార్మికులు, మౌలిక సదుపాయాలు లాంటి స్పష్టమైన హామీలను కూటమిలో తీసుకోనందునే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చిందని సంజయ్ రౌత్ అన్నారు.