కేజ్రీపై కాగ్​ మరో నివేదిక

Another CAG report on Kejri

Jan 11, 2025 - 14:18
 0
కేజ్రీపై కాగ్​ మరో నివేదిక

మద్యం అవినీతిలో రూ. 2026 కోట్లు నష్టం
ఆపద సీఎం పోస్టర్​ రిలీజ్​ చేసిన బీజేపీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాగ్​ రిపోర్టు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్​ కుంభకోణంపై మరో నివేదిక విడుదల చేసినట్లు బీజేపీ తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో రాష్ర్ట ప్రభుత్వ ఖజానాకు రూ. 2026 కోట్ల నష్ట వాటిల్లినట్లు తెలిపింది. శనివారం బీజేపీ పార్టీ నాయకులు కాగ్​ విడుదల చేసిన నివేదికను మీడియాకు విడుదల చేశారు. నివేదిక విడుదలతో ఆప్​ నేతల్లో టెన్షన్​ పెరిగి అవన్నీ ఆరోపణలేనని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నష్టపోతుందని తెలిసినా బిడ్డర్లకు లైసెన్సులు కట్టబెట్టారని ఆరోపించారు. వీరు రూపొందించిన ఎక్సైజ్​ పాలసీ లోపభూయిష్టంగా అభివర్ణించారు. దీంతో ఆప్​ నేతలు భారీగా ముడుపులు దండుకున్నారని, మద్యం ప్రియులపై భారీ భారం పడిందని నివేదిక పేర్కొంది. మనీష్​ సిసోడియా, మంత్రుల బృందం నిపుణులు చేసిన సిఫార్సులను పూర్తిగా విస్మరించారని కాగ్​ రిపోర్టులో పేర్కొన్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఇదంతా జరిగింది. వీరు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్​, ఎల్జీ అనుమతి తీసుకోలేదన్నారు. నిబంధనల ఉల్లంఘన, కోవిడ్​ పేరుతో రూ. 144 కోట్ల లైసెన్సు ఫీజుల మాఫీ, రీ టెండర్​ చేయకపోవడం, జోనల్​ లైసెన్సులకు మినహాయింపు ఇవ్వడం, సెక్యూరిటీ డిపాజిట్​ ను రికవరి చేయకపోవడం తదితర కారణాలతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని కాగ్​ నివేదికలో స్పష్టం చేసింది.

బీజేపీ మరో పోస్టర్​ రిలీజ్​..

మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఆప్​ అధినేతపై మరో పోస్టర్​ రిలీజ్​ చేసింది. ఈ పోస్టర్​ కు ‘ఆపదా సీఎం’ అని పేరు పెట్టింది. బాహుబలిలో విలన్​ గెటప్​ లో ఒక చిత్రం ఉండగా, మరో చిత్రంలో కేజ్రీ శీష్​ మహల్​ ముందు ముస్లిం రాజు వేషధారణలో ఉన్న పోస్టర్లను రిలీజ్​ చేసింది.