కాంట్రాక్టులలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్!
4 percent reservation for Muslims in contracts!

సీఎం సిద్ధరామయ్య మంత్రి వర్గం ఆమోదం
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు చట్టబద్ధత
మతపరమైన రిజర్వేషన్ ఆమోదయోగ్యం కాదు: ఎంపీ రవిశంకర్ ప్రసాద్
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుందని సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన సమావేశం నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు శనివారం మీడదియాకు వివరించారు. కర్ణాటక పాదర్శకత ప్రజా సేకరణ (కేటీపీపీ) చట్టానికి మార్పులను ప్రతిపాదించారని, ఇందుకు మంత్రివర్గం ఆమోదం లభించిందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీంతో నాలుగు శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పిస్తామన్నారు.
కాగా ఈ బిల్లుపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ బిల్లు చట్టవ్యతిరేకమని, తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో రిజర్వేషన్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా అనుమతించవచ్చన్నారు. కానీ ఏదైనా మతానికి నేరుగా రిజర్వేషన్ ఇవ్వడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.