బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టుపై నిఘా

రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

Feb 13, 2025 - 17:27
 0
బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టుపై నిఘా

నా తెలంగాణ, న్యూఢిల్లీ: బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్​ పై భారత్ నిఘా ఉంచిందని, చైనాకు తమ అభ్యంతరాలను కూడా తెలియజేసిందని కేంద్రమంత్రి కీర్తి వర్ధన్​ సింగ్​ అన్నారు. గురువారం పార్లమెంట్​ లో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుపై భారత్​ నిరంతరం పర్యవేక్షిస్తుందని నిశితంగా పరిశీలిస్తోందని సింగ్​ చెప్పారు. ఎగువ ప్రాంతాలలో జరిగే కార్యకలాపాలతో దిగువ ప్రాంతాలైన భారత్​ ప్రయోజనాలకు హాని కలిగించకుండా చూసుకోవాలని తేల్చి చెప్పామని అన్నారు. సరిహద్దు విషయంలో చర్చలు ఫలప్రదం దిశగా జరుగుతున్నాయని చెప్పారు. చైనా తన దేశ ప్రయోజనాల దృష్ట్యా బ్రహ్మపుత్రపై నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 60వేల మెగావాట్ల యూనిట్ల విద్యుత్​ ఉత్పాదనకు సిద్ధమైంది. ఇందుకు 167 బిలియన్​ డాలర్లను ఖర్చు చేస్తుందని వివరించారు. ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లనుందని చెప్పారు. బ్రహ్మపుత్ర ఉపనదులపై ఒక అధ్యయనం కూడా నిర్వహించామన్నారు.