ఓటీపీలు చెప్పొద్దు: ట్రాయ్ హెచ్చరిక
Don't tell OTPs: Troy warning

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 116 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు మరోమారు ట్రాయ్ (టీఆర్ఎఐ–టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఎస్ఎంఎస్, కాల్స్, సంక్షేమ పథకాల పేరిట వచ్చే వారికి ఎలాంటి ఓటీపీలు చెప్పవద్దని, అదే సమయంలో విదేశీ గుర్తు తెలియని కాల్స్ ను లిఫ్ట్ చేయొద్దని హెచ్చరించింది. అలాంటి వాటిని వెంటనే బ్లాక్ చేసేయాలని స్పష్టం చేసింది. దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు ట్రాయ్ మొబైల్ వినియోగదారులకు సమాచారాన్ని అందజేస్తుందని తెలిపింది. టెలికాం సంస్థలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల సందేశాలు, ఫోన్లు చేయవని గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.