రాహుల్ గాంధీకి సమన్లు!
ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసు

లక్నో: రాహుల్ గాంధీ భారతీయ సేనపై అనుచిత వ్యాఖ్యల కేసులో మార్చి 24న కోర్టుకు హాజరు కావాలని బుధవారం సమన్లు జారీ చేసింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆర్మీపై రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ అనే అధికారి యూపీలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ హాజరు తేదీని ఖరారు చేస్తూ సమన్లను జారీ చేసింది. వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని, కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.