మోదీ, బీజేపీని ఓడించేందుకు యూఎస్​ ఎఐడీ నిధులు

USAID funds to defeat Modi and BJP

Feb 12, 2025 - 15:40
 0
మోదీ, బీజేపీని ఓడించేందుకు యూఎస్​ ఎఐడీ నిధులు

కీలక విషయాలు వెల్లడించిన మైక్​ బెంజ్​ 

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: 2019 ఎన్నికల కంటే ముందు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆయా మాధ్యమాల ద్వారా పనిచేసిన అమెరికా విదేశాంగ శాఖ మాజీ సీనియర్​ అధికారి మైక్​ బెంజ్​ యూఎస్​ఎఐడీ విషయంలో భారీ నిజాలను బయటపెట్టాడు. మోదీ, బీజేపీని అస్థిరపరిచేందుకు యూఎస్​ఎఐడీ నిధుల ద్వారా అనేక ప్రయత్నాలు జరిగాయి. మైక్​ బెంజ్​ గతంలో వైట్​ హౌస్​ లో ట్రంప్​ నకు ప్రసంగాలను రాసి ఇచ్చే అధికారిగా కొలువు వెలగబెట్టాడు. ఇదంతా అమెరికా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగింది. అంతేగాక భారత్​–బంగ్లాల మధ్య రాజకీయ జోక్యానికి కూడా ప్రయత్నించింది. 

పత్రికా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని ఓడించే ప్రయత్నాలు జరిగాయి. కానీ అందులో సఫలం సాధించలేదు. యూఎస్​ఎఐడీ ప్రధాన ఉద్దేశం మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని రిక్రూట్​ చేసుకొని వారి ద్వారా తప్పుడు ప్రచారాలకు తెరతీయడం వీరికి నష్టం కలిగించడం. అలాంటి సంస్థలు, వ్యక్తులకు నిధులను సమకూర్చడం కూడా ఈ సంస్థే చూసుకుంటుంది. సెన్సార్​ షిప్​, వీవర్స్​ షిప్​ ల ఆధారంగా మీడియా మాధ్యమాలను కూడా ఉపయోగించుకున్నారు. అసత్య కథనాలు సృష్టించారు. ఉద్యోగాన్ని వదిలిన అనంతరం మైక్​ ఎన్జీవో సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా డిజిటల్​ సెన్సార్​ షిప్​, మీడియా కథనాలపై అధ్యయనం చేస్తూ నివేదికలను రూపొందిస్తుంటాడు. 

మైక్​ బెంజ్​ ఎవరు?..
మైక్​ బెంజ్​ 2020 నుంచి 2021 వరకు ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన మాజీ యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి. సైబర్ సమస్యలపై యూఎస్​ విధానాన్ని రూపొందించడానికి, ప్రధాన టెక్ కంపెనీలతో దగ్గరగా పనిచేయడానికి ఈయన బాధ్యత వహించారు. ట్రంప్​ అధ్యక్షుడిగా ఉన్న తొలుతలో ఆయనకు ప్రసంగాలు రాసి పెట్టేవారు.