సంభాల్ హింస విదేశాల్లో మూలాలు
80మంది అరెస్ట్ 79మంది పరారీ

లక్నో: సంభాల్ హింస మూలాలు విదేశాల్లో నక్కి ఉన్నాయి. పోలీసులు ఇటీవలే దాఖలు చేసిన చార్జీషీట్ లోని పలు విషయాలు శనివారం వెలుగుచూశాయి. హింసకు కారణం ప్రధాన నిందితుడు దుబాయ్ లో నక్కి ఉన్న షరీక్ సాతాగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కోర్టులో ఆరువేల పేజీల చార్జీషీట్ ను పోలీసులు దాఖలు చేశారు. 2024 నవంబర్ 24న హింస చెలరేగగా 12 ఎఫ్‌ఐఆర్‌లలో ఆరు కేసుల్లో అభియోగాలు మోపారు. చార్జిషీట్‌లో మొత్తం 159 మందిని నిందితులుగా చేర్చగా, 80 మందిని అరెస్టు చేశారు. 79 మంది పరారీలో ఉనారు. నిందితుల్లో ఎస్పీ నాయకులు సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్, ఇక్భాల్ మహమూద్ కుమారుడు సుహైల్ ఇక్బాల్ పేర్లను కూడా చేర్చారు.
నవంబర్ 25న నిందితులై నాయకుల పేర్లను చేర్చారు. నవంబర్ 28న దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్ ఏర్పాటు చేశారు. 29న జామా మసీదు కేసు విచారణ నిలిపివేయాలని సంభాల్ కోర్టును సుప్రీంఆఏశించింది. కాగా అలహాబాద్ హైకోర్టు విచారించే వరకు చర్యలు తీసుకోమని పేర్కొంది. డిసెంబర్ 1, జనవరి 21, జనవరి 30 యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ మూడుసార్లు సంభాల్ చేరుకొని ఉద్యోగులు, అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసింది.
కాగా ముఖ్య నిందితుడైన షరీక్ సాతాను ఢిల్లీ ఎన్ సీఆర్ నుంచి 300కు పైగా వాహనాలను దొంగిలించిన కార్ల దొంగతన ముఠా నాయకుడుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇతనికి నేరుగా దావూద్, పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని చార్జీషీట్ లో ఆరోపించారు.