హస్తంలో తనస్థానమేంటీ? రాహుల్​ ను నిలదీసిన థరూర్​!

What is in the hand? Tharoor deposed Rahul!

Feb 22, 2025 - 14:23
 0
హస్తంలో తనస్థానమేంటీ? రాహుల్​ ను నిలదీసిన థరూర్​!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీలో తనస్థానమేంటో చెప్పాలని ఆ పార్టీ సీనియర్​ నాయకుడు శశిథరూర్​ రాహుల్​ గాంధీని ప్రశ్నించారు. గత కొంతకాలంగా పార్టీలో తాను ఆశించిన గౌరవ మర్యాదలు తనకు దక్కడం లేదని ఆవేదనతో ఉన్నారు. తనను పక్కన పెట్టడం పట్ల రాహుల్​ తో తన అంతృప్తిని వెళ్ళగక్కారు. తనను ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు. తన స్థానం ఏంటో స్పష్టంగా చెప్పాలని థరూర్​ రాహుల్​ ను నిలదీశారు. కాగా థరూర్​ ప్రశ్నలకు రాహుల్​ గాంధీ దాటవేత ధోరణినే ప్రదర్శించారు. కాంగ్రెస్​ పార్టీలో ఈ అంతర్గత నిలదీత ఫిబ్రవరి 18న జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా శనివారం ఈ విషయాలు బయటికి పొక్కాయి. భారత్​ పై ట్రంప్​ విధానం, ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై శశిథరూర్​ పాజిటివ్​ గా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్​ కమిటీ థరూర్​ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అందుకే పలుకార్యక్రమాల్లో ఈయనకు చోటు కల్పించొద్దని నిర్ణయించారని సమాచారం. విషయం తెలుసుకున్న థరూర్​ నేరుగా రాహుల్​ తోనే ఈ విషయాన్ని తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే సరైన సమాధానం రాకుంటే, తనకుపార్టీలో సముచిత స్థానం లభించకుంటే తట్టా బుట్టా సర్దుకునే అవకాశం కూడా లేకపోలేదని కాంగ్రెస్​ వర్గాలు భావిస్తున్నాయి. అధిష్టానం సోనియా, రాహుల్​, ప్రియాంకల వద్దకు నేరుగా ఎలాంటి అపాయింట్​ మెంట్​ లేకుండా వెళ్లగలిగే వారిలో థరూర్​ ఒకరనే వాదన కూడా ఉంది. ఇలాంటి నాయకున్ని పక్కన పెట్టడంపై కాంగ్రెస్​ వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలున్నాయనే విషయం బయకు పొక్కింది. ఏది ఏమైనా కాంగ్రెస్​ పార్టీకి దేశంలోనే కాదు.. పార్టీలోనూ ఎదురుపవనాలు వీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.