రూ. 3.5 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
Rs. 3.5 crore foreign currency seized

ముంబాయి: నిఘా సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని పూణేలోని కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఐయూ) భారీ హవాలా రాకెట్‌ను ఛేదించింది. ఈ ముఠా విదేశాలకు వెళ్లే విద్యార్థులను ఉపయోగించి విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసేది. బుధవారం పూణే విమానాశ్రయంలో విద్యార్థుల పుస్తకాలో ఉన్న రూ. 3.5 కోట్ల అమెరికన్ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు అమెరికన్ కరెన్సీని అందించిన ఖుష్బూ అగర్వాల్, మహ్మద్ ఆమిర్ లను అరెస్టు చేశారు. విచారణలో ఈ విషయం వారికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. దీనిపై ఫిబ్రవరి 17నే సమాచారం అందుకున్న నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న సంస్థపై దాడి చేసి రూ. 45 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో పూణే, ముంబాయి, అహ్మాబాద్ లకు చెందిన కస్టమ్స్ అధికారులు పాల్గొన్నారు. మూడు ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.