థాయ్​ లో బస్సు ప్రమాదం.. 18 మంది మృతి!

Bus accident in Thailand.. 18 dead!

Feb 26, 2025 - 18:51
 0
థాయ్​ లో బస్సు ప్రమాదం.. 18 మంది మృతి!

బ్యాకాంక్​: థాయ్​ లాండ్​ లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది  మృతి చెందగా, 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు థాయ్​ లాండ్​ లోని బ్యాకాంక్​ కు 155 కి.మీ. దూరంలోని ప్రాచిన్​ బురి ప్రావిన్స్​ లో టూరిస్ట్​ బస్సుకు బ్రేకులు ఫెయిల్​ కావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బస్సు అదుపుతప్పి చిన్న లోయలో బోల్తా కొట్టిందన్నారు. ఈ బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ చర్యలు చేపట్టి గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై థాయ్​ ప్రధాని పేటోంగ్టార్న్​ షినవత్రా సంతాపం ప్రకటించారు. కారణాలపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.