తొక్కిసలాటపై ప్రాథమిక నివేదిక వెల్లడి
Preliminary report on stampede revealed

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శనివారం రాత్రి న్యూ ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ప్రాథమిక నివేదిక ఆదివారం సమర్పించారు. ఫ్లాట్ ఫామ్ 14 వద్ద ప్రయాగ్ రాజ్ కు వచ్చే రైలు రాబోతుందని ప్రకటించారు. రైలు కాస్త ఆలస్యమైంది. అదనపు రైలు ఫ్లాట్ ఫామ్ 12పై వస్తుందని ప్రకటించారు. ఇది విన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఫ్లాట్ ఫామ్ 12పైకి వెళ్లేందుకు పరుగులు తీశారు. దీంతో మెట్ల మార్గంలో పలువురు కింద పడి తొక్కిసలాటకు కారణమైనట్లుగా ప్రాథమిక నివేదిక వెల్లడించింది. కాగా ఈ ఘటనపై ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులతో సమగ్ర విచారణకు రైల్వే శాఖ మంత్రి ఆదేశించారు. తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.