గొగోయ్​ ఐఎస్​ఐ బంధంపై విచారణ

  సీఎం హిమంత బిశ్వ శర్మ

Feb 16, 2025 - 19:11
 0
గొగోయ్​ ఐఎస్​ఐ బంధంపై విచారణ

డీస్ఫూర్​: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కు ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై అసోం ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీపై ఎంపీ గొగోయ్​ చేసిన విమర్శలు, ఆరోపణలపై సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. తాను పదవిలో ఉన్నంతకాలం దేశ భద్రతను కాపాడతానని ప్రమాణం చేశానని చెప్పారు. అందువల్ల ఎంపీ గౌరవ్​ గొగోయ్​ దేశ వ్యతిరేక చర్యలు, బీజేపీపై అనుచిత వ్యాఖ్యలపై చర్యలుంటాయన్నారు. గతంలో ఈ అంశంపై మాట్లాడుతూ ఎంపీ భార్యకు పాక్​ ఐఎస్​ఐ, జార్జ్​ సోరోస్​ సంస్థలతో సంబంధాలున్నాయన్నారు. ఈ మొత్తం విషయాలపై సిట్​ ఏర్పాటు చేస్తామని సీఎం శర్మ స్పష్టం చేశారు.