బంగ్లా ఓటు బ్యాంకుతో మమత లబ్ధి

కేంద్రమంత్రి సుకాంత్​ మజుందార్​ 

Feb 16, 2025 - 18:38
 0
బంగ్లా ఓటు బ్యాంకుతో మమత లబ్ధి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్​ నుంచి వచ్చి ముస్లిం వ్యక్తులను తన ఓటు బ్యాంకుగా మలచుకొని రాజకీయ లబ్ధి పొందడమే సీఎం మమత బెనర్జీ పని అని ఈ కేంద్రమంత్రి సుకాంత్​ మజుందార్​ మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మమత ఆరోపణలను ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఖండించారు. తొక్కిసలాట ఘటనపై కుట్రకోణం ఉందా? అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తన పనితీరులో సమర్థుడని, ఈ ఘటనపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 2026 ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆమెకు అర్థం అయిపోయిందన్నారు. అందుకే ఇప్పటి నుంచే ఆమె ఓటు బ్యాంకును సిద్ధం చేసుకుంటుందని ఆరోపించారు. ఓటమికి సాకు వెతుకుతున్నారని విమర్శించారు. మూడింట రెండొంతుల మెజార్టీతో గెలుపొందుతామని ఆమె పగటి కలలు కంటున్నారని అన్నారు. అంత విశ్వాసం ఉంటే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేలా మమత ప్రభుత్వం ఎందుకు సన్నాహాలు చేయడం లేదో చెప్పాలన్నారు.