ట్రంప్ పై పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం!
Pope Francis is angry with Trump!

రోమ్: అక్రమ వలసలను నిరోధించడం కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేపడుతున్న చర్యలపై కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన విడుదల చేశారు. వలసదారుల గౌరవాన్ని ఉల్లంఘించే చర్యలను తప్పుబట్టారు. ట్రంప్ చర్యల ఫలితాలు చెడుప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై అమెరికాలోని పలువురు బిషప్ లకు కూడా పోప్ ఫ్రాన్సిస్ లేఖను విడుదల చేశారు. సంఘర్షణ, పేదరికం, వాతావరణ వైపరీత్యాల నుంచి పారిపోతున్న ప్రజలను స్వాగతించి రక్షించాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు పిలుపునిచ్చారు.