గ్రామీ అవార్డుకు నామినేట్.. ఎంజీ స్టోన్ మృతి
Nominated for Grammy Award.. Angie Stone passed away

అలబామా: గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ప్రముఖ గాయని ఎంజీ స్టోన్ (63) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం రాత్రి అలబామా నుంచి అట్లాంటాకు బయలుదేరిన ఆమె వ్యాన్ ను ట్రక్కు ఢీకొంది. వ్యాన్ లో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి గాయాలైనట్లు అలబామా హైవే పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. ఈమె ఒక్కరే మృతి చెందారని అధికారులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంజీ స్టోన్ మృతిలో పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఎంజీ స్టోన్ పాడిన ‘విష్ ఐ డిడ్ నాట్ మిస్ యు’ పాట బాగా ప్రాచుర్యం పొందింది, పేరుతెచ్చిపెట్టింది. సెంట్రల్ ఇంటర్‌కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ పురుషుల ఛాంపియన్‌షిప్ బాస్కెట్‌బాల్ గేమ్‌లో హాఫ్ టైం షోలో ఏంజీ స్టోన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఆటగాళ్లంతా ఒక క్షణం మౌనం పాటించారు.