సిక్కుల హత్య.. దోషి కాంగ్రెస్​ మాజీ ఎంపీ!

Murder of Sikhs.. Convicted ex-Congress MP!

Feb 12, 2025 - 15:18
 0
సిక్కుల హత్య.. దోషి కాంగ్రెస్​ మాజీ ఎంపీ!

తీర్పునిచ్చిన రౌస్​ అవెన్యూ కోర్టు
ఫిబ్రవరి 18న శిక్ష ఖరారు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసు 1984, ఇద్దరి హత్య కేసులో కాంగ్రెస్​ మాజీ ఎంపీ సజ్జన్​ కుమార్​ ను ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. బుధవారం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. 41 ఏళ్ల తరువాత ఈ కేసులో తీర్పు రావడం గమనార్హం. కాగా ఫిబ్రవరి 18న కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.2018లో ఢిల్లీ హైకోర్టు వేరే కేసులో ఇతన్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఇతను తీహార్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సజ్జన్​ కుమార్​ పై ఐపీసీ సెక్షన్లు 147, 149, 148, 302, 308, 323, 395, 397, 427, 436, 440 కింద అల్లర్లు, హత్య, దోపిడీ కింద కేసులే నమోదయ్యాయి. 1984లో అల్లర్లు చెలరేగగా సరస్వతి విహార్​ లో జస్వంత్​ సింగ్​, తరుణ్​ దీప్​ సింగ్​ అనే ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పంజాబీ బాగ్​ పోలీస్​ స్టేషన్​ లో సజ్జన్​ కుమార్​ పై కేసు నమోదైంది. ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగానే కొందరు గుంపు ఓ ఇంటిపై దాడి చేసి ఇద్దరినీ హత్య చేశారు. కాగా ఆ సమూహాన్ని రెచ్చగొట్టింది సజ్జన్​ కుమార్​ అని ఇన్నేళ్లకు కోర్టు నిర్ధారించింది.