చతుర్ముఖ వ్యూహం.. నక్సల్స్​ నుంచి విముక్తి

Four-pronged strategy.. Freedom from Naxals

Feb 12, 2025 - 15:07
 0
చతుర్ముఖ వ్యూహం.. నక్సల్స్​ నుంచి విముక్తి

ఏకకాలంలో ముందుకు
మౌలిక సదుపాయాలు
ప్రజల్లో అవగాహన
శిక్షణా కార్యక్రమాలు
భారీగా నిధుల కేటాయింపు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: దేశాన్ని 2026 వరకు మావోయిస్టు విముక్తి దేశంగా రూపుదిద్దాలని కేంద్రం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే లొంగిపోయి ప్రజాజీవన స్రవంతిలో శాంతి, అభివృద్ధి దిశగా జీవనం గడుపుతారా? లేకుంటే హింసకు పాల్పడుతూ కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో సమిధలుగా మారుతారా? మీరే నిర్ణయించుకోవాలని ప్రకటించింది. ఇప్పటికే ఈ విధానం చాలా సత్ఫలితాలిచ్చినప్పటికీ, అత్యధిక ఎన్​ కౌంటర్లలో నక్సల్స్​ మృతిచెందడం కూడా ఆందోళనకు కారణభూతంగా నిలుస్తుంది. కాగా మావోయిస్టుల విముక్తి కోసం కేంద్రం చతుర్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతుండడంతో విజయవంతమవుతుంది.

గ్రామాల్లో నెట్​ వర్క్ పటిష్టం చేయడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన, భారీ సంఖ్యలో ఛత్తీస్​ గఢ్​ లో పోలీస్​ స్టేషన్లు, ఔట్​ పోస్టుల ఏర్పాటు, రోడ్డుల నిర్మాణం, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ, ఇంటలిజెన్స్​ తో పక్కా సమాచార సేకరణ లాంటి వ్యూహాలు నక్సల్స్​ ను నిలువరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఎటా నక్సల్స్​ హింస కేసులు 81 తగ్గగా, మరణాలు 85 శాతం తగ్గాయి. నక్సల్స్​ పై భద్రతా దళాలు ఓ కన్నేసి ఉంచడంతో వారి కార్యకలాపాలకు ఆటంకాలుగా ఎదురవుతున్నాయి. హింసాత్మక ఘటనలు 2018లో 126 నమోదు కాగా, 2021లో 70, 2024లో  సంఖ్య 38కి తగ్గింది. 2010లో 1936తో పోలిస్తే 374 శాతానికి తగ్గింది. వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అవలంభిస్తున్న సమగ్ర, ధృడమైన విధానం వల్లే హింసలో తగ్గుదల నమోదయ్యింది. 

గత ఐదేళ్లలో చత్తీస్​ గఢ్​ లోని 90 జిల్లాలకు ‘ఎస్​ ఆర్​ ఇ’ పథకం కింద రూ. 1925.83 కోట్లలో మావోల ప్రభావిత ప్రాంతాలకే రూ. 830 కోట్లు దక్కాయి. ఈ నిధులు నక్సల్స్​ హింసలో మరణించిన కుటుంబాలకు ఎక్స్​ గ్రేషియాగా ప్రభుత్వం అందజేసింది. అంతేగాక ప్రత్యేక మౌలిక సదుపాయాల కింద రూ. 85.42 కోట్లు, ప్రత్యేక నిఘా, దళాల కోసం రూ. 394.31 కోట్లు కేటాయించింది. 702 పోలీస్​ స్టేషన్లలో 612 ఎఫ్​ పీఎస్​ లు (ఫారెస్ట్​ పోలీస స్టేషన్లు)ఇప్పటికే నిర్మించారు. కేవలం చత్తీస్​ గఢ్​ నగరంలోని 122 ఎఫ్​ పీఎస్​ లను నిర్మించారు. దీంతో నక్సల్స్​ తప్పించుకోవడానికి వీలు లేకుండా భద్రతా దళాల గస్తీ ఉంది. మౌలిక సదుపాయాలకై ఎస్​ సీఎ పథకం కింద రూ. 2384.17 కోట్లు విడుదల చేయగా, కేవలం చత్తీస్​ గఢ్​ కే రూ. 774 కోట్లు దక్కాయి. హింస ప్రభావిత ప్రాంతాల్లో 4046 కి.మీ. మేర రోడ్లను నిర్మించగా, 1333 సెల్​ టవర్లను నిర్మించారు. స్థానిక జనాభాకు అనుగుణంగా 1214 పోస్టాఫీసులు, 297 బ్యాంకులు, 268 ఏటీఎంలు, 9 ఐటిఐలు, 14 నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాలు, 45 ఏకలవ్య మోడల్​ రెసిడెన్షియల్​ పాఠశాలలు ప్రారంభించారు. ఇవే గాకుండా యువత నక్సల్స్​ లో చేరకుండా వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలను నెలకోసారి స్థానిక గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం దేశాన్ని, ముఖ్యంగా నక్సల్స్​ కు కంచుకోటగా ఉన్న చత్తీస్​ గఢ్​ ను పూర్తి నక్సల్స్​ రహితంగా తీర్చిదిద్దేందుకు 2015లోనే దీర్ఘకాలిక వ్యూహాన్ని సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రతీ బడ్జెట్​ లోనూ కేటాయింపులను పెంచుతూ ప్రస్తుతం భారీ కేటాయింపుల దిశగా పయనిస్తుంది. దీంతో దశల వారీగా హింసాత్మక కార్యకలాపాల పరిణామాలు కూడా అదేవిధంగా ఉంటాయని, నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజనులు, యువతకు తెలియజెబుతూ వారిని దేశాభివృద్ధిలో పయనింపచేసేందుకు ప్రయత్నిస్తోంది.