మదర్సాలపై ‘మమతా’నురాగం

Mamata's love for madrassas

Feb 16, 2025 - 17:25
 0
మదర్సాలపై ‘మమతా’నురాగం

భారీ బడ్జెట్​ కేటాయింపులు 
పాక్​ దారిలో నడవడంపై విమర్శలు
అందివస్తున్న రంగాలపై చిన్నచూపు 

కోల్​ కతా: పశ్చిమ బెంగాల్​ సీఎం మమత ప్రభుత్వం గత వారం ప్రకటించిన రాష్​ర్ట బడ్జెట్​ లో మైనార్టీ వ్యవహారాలు, మదరసాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు పలు ఆరోపణలు, విమర్శలకు దారి తీస్తుంది. దేశానికి, రాష్ర్టానికి ఆయువు పట్టైన వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సంస్థలకు తొలి కేటాయింపులుండాలని ఆర్థిక వేత్తలు భావించారు. కానీ వినూత్నంగా అత్యధిక కేటాయింపులు రాష్ర్టాన్ని పూర్తి అగాధంలోకి నెట్టేలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీంతో టీఎంసీ ప్రభుత్వం మైనార్టీలపై కరుణ, దయ చూపుతున్న విషయం ఇట్టే అర్థం అవుతుంది. మిగతా రంగాలకు మాత్రం తూతూ మంత్రంగా కేటాయింపులు ఉండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. 2016లో మదర్సాల విద్యకు రూ. 12 కోట్లు ఉండగా 2024 నాటికి రూ. 4016 కోట్లకు పెరిగింది. ఇది 13ఏళ్లలో 335 రెట్లు పెరిగింది. రాష్ర్టంలో గ్యాస్​ కనెక్షన్లు లేని నిరుపేదలు ఎందరో ఉన్నారు. నిరుద్యోగం తాండవిస్తుంది. ఔత్సాహిక ఉన్నత విద్యనభ్యసించిన వారు చిన్న చిన్న పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయాలని ఋణాల కోసం ఎదురుచూస్తున్నా సీఎం మమత ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా పాక్​ దారిలో నడుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

కేటాయింపులు..

– మైనారిటీ వ్యవహారాలు, మదరసా విద్యాశాఖకు రూ.5602.29 కోట్లు.
– వెనుకబడిన వర్గాలకు రూ.242 కోట్లు
– గిరిజనాభివృద్ధికి రూ.1210.13 కోట్లు
– మత్స్యశాఖకు రూ.530.11 కోట్లు
– కార్మికులకు రూ.1229.1 కోట్లు
– యువజన సర్వీసులు, క్రీడలకు రూ.840.03 కోట్లు 
– సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.80.89 కోట్లు
– సాంకేతిక విద్య శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి రూ.1423.86 కోట్లు
– పారిశ్రామిక వాణిజ్యం, సంస్థలకు రూ.1477.91 కోట్లు