ఎంపీ సంబిత్ పాత్ర, దలైలామాకు జడ్ కేటగిరి
ఐబీ హెచ్చరికతో కేంద్రం ఉత్తర్వులు జారీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ నాయకుడు సంబిత్ పాత్ర, బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు కేంద్రం జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వీరిద్దరికి సాధారణ భద్రతను కేంద్రం కల్పించింది. ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలతో అప్రమత్తమైంది. ప్రస్తుతం మణిపూర్ బీజేపీ ఇన్ చార్జీగా సంబిత్ పాత్ర వ్యవహరిస్తున్నారు. ఇకపై వీరికి 30మంది సీఆర్పీఎఫ్ కమాండోల బృందం భద్రత కల్పించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న టిబెటన్ మత గురువు దలైలామాకు ప్రస్తుతం స్థానిక భద్రత మాత్రమే లభిస్తుంది. 1950లో టిబెట్ పై చైనా దాడి చేసి ఆక్రమించింది. దలైలామా భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి దలైలామాకు భారత్ ఆశ్రయం కల్పిస్తుంది. 1989లో ఈయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. టిబెట్ న్ల న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన పోరాటం చేస్తున్నారు. 62 సంవత్సరాలుగా భారత్ లో ఉంటున్నారు. అయితే వీరిద్దరికి ఎవరి ద్వారా ప్రమాదం ఉందనేది మాత్రం ఐబీ వెల్లడించిన వివరాలను కేంద్రం బయటపెట్టలేదు.