కుంభమేళా @ 61.44 కోట్లు
Kumbh Mela @ 61.44 crores

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా శనివారం అర్థరాత్రి నుంచే రోడ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఆదివారం ప్రయాగ్ రాజ్ కు రావాల్సిన 67 రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం బ్రహ్మముహూర్తం వేకువజాము 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 70 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలాచరించారు. దీంతో 42వ రోజు మధ్యాహ్నానికి స్నానాలాచరించిన వారి సంఖ్య 61.44 కోట్లకు చేరిందని అధికారులు తెలిపారు. ఇక ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్లన్నీ కిటకిటలాడుతుండగా, విమానాశ్రయంలోనూ భారీ రద్దీ ఏర్పడింది. కాఫీ, టీల కోసం కూడా గంటపాటు వేచి ఉండాల్సి రావడం విశేషం. విమానాశ్రయానికి వస్తున్న వాహనాలను, ప్రయాణికులను బయట పార్కింగ్ వద్దే నిలిపివేశారు. మూడు గంటల ముందు ఎయిర్ పోర్ట్ కు వచ్చిన వారికే ప్రవేశం కల్పిస్తున్నారు. అన్ని విమానాల్లో టికెట్లు బుకింగ్ అయిపోవడంతో అప్పటికప్పుడు వెళ్లాల్సిన ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. 26 మహాశివరాత్రి నాటికి పుణ్య స్నానాలు ఆచరించే వారి సంఖ్య 65కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా ప్రయాగ్ రాజ్ కు దారితీసే ఏడు ఎంట్రీ పాయింట్ల వద్ద ఒక్కో ఐజీని, భద్రతా బలగాలను నియమించారు.