అవినీతి, అక్రమవలసలపై ఉక్కుపాదం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికా నుంచి అవినీతిని అంతమొందిస్తానని, అక్రమ వలసదారులను పూర్తిగా బహిష్కరిస్తానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అక్రమ వలసదారుల బహిష్కరణపై తన చర్య సరైందనని సమర్థించుకున్నారు. కన్జర్టేటివ్ పోలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ ప్రసంగించారు. తమ దేశంలో తిష్టవేసి బాహ్యాశక్తులను ప్రభావితం చేసే దుండగులు, డీప్ స్టేట్ బ్యూరో క్రాట్లను తిరిగి పంపిస్తున్నామని అన్నారు. అక్రమ వలసదారులను బహిష్కరించడం తన ప్రాథమిక విధానమన్నారు. మోసగాళ్లు, అసత్యాలు చెప్పేవారు, నిజాయితీ లేని వారిని బయటకు పంపేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిని ఉపేక్షించబోమన్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో కొన్ని విభాగాల పనితీరును సరిచేయడం ప్రారంభించామన్నారు. కాగా ఫిబ్రవరి 3వ తేదీ నాటికి 8,768మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.