32మంది భారత మత్స్యకారులు అరెస్ట్​

ఐదు బోట్లు స్వాధీనం

Feb 23, 2025 - 18:18
 0
32మంది భారత మత్స్యకారులు అరెస్ట్​

వెల్లడించిన శ్రీలంక నావికాదళం

చెన్నై: శ్రీలంక నావికాదళం 32 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను స్వాధీనం చేసుకుంది. శ్రీలంక సముద్ర జలాల్లోకి ఫిషరీస్​ బూట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించి చేపలు పడుతున్నట్లు నేవీ అధికారులు భారత నేవీకి ఆదివారం సమాచారం అందించారు. 2025లో ఇప్పటివరకు శ్రీలంక నావికాదళం 131 మంది భారత జాలర్లను అరెస్టు చేశారు. 18 పడవలను స్వాధీనం చేసుకున్నారు. మన్నార్​ కుఉత్తరాన చేపట్టిన ఆపరేషన్​ లో వీరిని అరెస్టు చేసినట్లుగా తెలిపింది. మత్స్యకారులను వారి పడవలను తలైమన్నార్​ పీర్​ కు తీసుకువచ్చామని, చట్టపరమైన చర్యల కోసం వారిని మన్నార్​ ఫిషరీస్​  అధికారులకు అప్పగిస్తామని నేవీ స్పష్టం చేసింది.