జమ్మూకశ్మీర్ చేనేత ఎగుమతులు రూ. 2,567 కోట్లు
Handloom exports of Jammu and Kashmir Rs. 2,567 crores

శ్రీనగర్: గత రెండు సంవత్సరాల్లో జమ్మూకశ్మీర్ హస్తకళలు, చేనేత ఉత్పత్తుల ఎగుమతులు రూ. 2,567 కోట్లుగా నమోదైంది. 2025 మార్చి చివరి నాటికి ఈ రంగాలు రూ. 3వేల కోట్ల ఎగుమతులను సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం కశ్మీర్ హస్తకళలు, చేనేత శాఖ డేటాను విడుదల చేసింది. 2024–25లో ప్రపంచవ్యాప్తంగా అనేక ఒడిదుడుకులున్నా ఎగుమతుల పెరుగుదల గణనీయంగా ఉందని అధికారులు చెప్పారు. కశ్మీర్ లోయలోని కని, సోజ్నిశాలువాలు ఎగుమతులు రూ. 1,105 కోట్లుగా ఉంది. తివాచీల ఎగుమతి రూ. 728 కోట్లుగా ఉండగా, ఇతర ఉత్పత్తులు, చెక్కబొమ్మల ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. పీఎం సబ్సిడీ పథకం ద్వారా చేతి వృత్తుల తయారీ దారులను ప్రోత్సహిస్తున్నారు. చేతి వృత్తుల తయారీ దారులు నిర్దేశించిన ధరల్లోని లాభం కంటే సబ్సిడీ పథకం కింద మరో 10 శాతం ఎక్కువ లాభాన్ని అందజేస్తున్నారు. చేనేత మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకున్న ఎగుమతిదారుల కోసం రూ. 5 కోట్ల వరకు రీయింబర్స్ మెంట్ కల్పిస్తున్నారు.