మంచి నాయకులు దేశ భవిష్యత్ నే మార్చగలరు
సోల్ లీడర్ షిప్ కాన్ క్లేవ్ లో ప్రధాని మోదీ

స్వామి వివేకానంద నమ్మకాలు నిజమే
ప్రపంచంలో పదిలో 9 వజ్రాలు గుజరాత్ వే
దశ, దిశ, లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు సాగాలి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వందమంది మంచి నాయకులు దేశానికి లభిస్తే దేశ భవిష్యత్ నే మార్చేయవచ్చని, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపొచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీ భారత మండపంలో జరిగిన సోల్ లీడర్ షిప్ కాన్ క్లేవ్ తొలి ఎడిషన్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. చాలామంది గుజరాత్ విడిపోవడంపై పలువురు విమర్శలు చేశారని కానీ నాయకత్వ బలంతో గుజరాత్ నంబర్ వన్ రాష్ర్టంగా మారిందన్నారు.
వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపర్చుకోవాలి..
ప్రతీ ఒక్కరూ దశ, దిశ, లక్ష్యం ఏమిటన్నది నిర్దేశించుకోవాలన్నారు. మంచినాయకులు దేశగతిని మార్చగలని స్వామి వివేకానంద నమ్మేవారని గుర్తు చేశారు. అదే మంత్రంతో దేశ ప్రజలంతా ముందుకు వెళితే ప్రపంచంలో భారతీయుల సత్తా ఏమిటో చాటి చెప్పగలమన్నారు. జాతి నిర్మాణం కోసం పౌరుల అభివృద్ధి కూడా అవసరమేనని, ఇందుకు ముందుగా వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపర్చుకోవాలన్నారు. దేశం ఉన్నతస్థాయిలో చేరుకోవాలంటే ముందుగా దేశ ప్రజలే ఉన్నతస్థానంలో ఉండాలన్నారు. అప్పుడే అద్భుతమైన దేశ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. అదే సమయంలో మంచి నాయకులు దేశానికి ఎంతో అవసరమన్నారు. దేశ అభివృద్ధిలో సౌల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్ సిప్ స్థాపన అతిముఖ్యమైన అడుగుగా నిలుస్తుందన్నారు.
సరైన దిశలో నడిపించే నాయకుడు అవసరం..
పరుగులు పెడుతున్న ప్రపంచ విధానాలు, మార్పులు, సాంకేతిక యుగంలో దేశాన్ని సరైన రీతిలో నడిపించగల నాయకుడు ఎంతో అవసరమని మోదీ చెప్పారు. ఇందుకు మానవ వనరుల లభ్యత కూడా అతి ముఖ్యమైనదన్నారు. ప్రపంచావసరాలను గుర్తిస్తూ అందరిని ఒప్పిస్తూ, మెప్పిస్తూ తమ దేశ అభివృద్ధిని సాధించేవారే నిజమైన నాయకులని చెప్పారు. నేడు గుజరాత్ దేశానికి రోల్ మోడల్ రాష్ర్టంగా మారిందన్నారు. ప్రపంచంలోని పది వజ్రాలలో 9 గుజరాత్ నుంచే వెళుతున్నాయని చెప్పారు. భారతదేశం వేగంగా ప్రపంచశక్తిగా ఎదుగుతుందని చెప్పారు. వృద్ధిని నిలబెట్టుకునే సవాళ్లను, సమస్యలను సమర్థవంతంగా, ప్రణాళికా బద్ధంగా ఎదుర్కునే అవసరం ఉందని, గేమ్ ఛేంజర్ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నాయకత్వాన్ని కూడా శాస్ర్తీయతతో జోడించి పరివర్తనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రూ. 150 కోట్లతో సోల్ క్యాంపస్ అభివృద్ధి..
ఫిబ్రవరి 21, 22న రెండు రోజులపాటు నిర్వహించే ఈ కాన్ క్లేవ్ లో రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మిక ప్రపంచం, ప్రజా విధానం, వ్యాపారం, సామాజిక రంగం వంటి విభిన్న రంగాలకు చెందిన నాయకులు తమ స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రమాణాలను పంచుకుని, నాయకత్వానికి సంబంధించిన అంశాలను చర్చించే ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడనుంది. సోల్ క్యాంపస్, రాబోయే రెండేళ్లలో రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇది గిఫ్ట్ సిటీ రోడ్‌లోని గుజరాత్ బయోటెక్నాలజీ విశ్వవిద్యాలయం సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
భూటాన్ ప్రధానితో మోదీ చర్చలు..
ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. షెరింగ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అంశాలపై విస్తృతస్థాయిలో ర్చలు జరిపారు. సోల్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సుధీర్ మెహతా, బోర్డు సభ్యులు భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ హస్ముఖ్ అధియా, సీనియర్ కార్యదర్శులతో పలువురు హాజరయ్యారు.