భారత్​–ఈయూ భాగస్వామ్యం విలువైనది

India-EU partnership is valuable

Feb 28, 2025 - 15:24
 0
భారత్​–ఈయూ భాగస్వామ్యం విలువైనది

మోదీ ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యానికి ధన్యవాదాలు
ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–ఈయూ భాగస్వామ్యం విలువైనదని, ఈ బంధం మరింత బలపడాలని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్​ డెర్​ లేయన్​ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. టాటా మోటార్స్​, ఐవోసీఎల్​ సంయుక్తంగా నడుపుతున్న హైడ్రోజన్​ బస్సులో శుక్రవారం యూరోపియన్​ కమిషన్​ కమిషనర్లు ప్రయాణించి ఢిల్లీలోని హైదరాబాద్​ హౌస్​ కు చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశ వివరాలను ఉర్సులా వివరించారు. భారత్​– -మధ్యప్రాచ్యం- యూరప్ ఆర్థిక కారిడార్ వంటి కీలకమైన కనెక్టివిటీ కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు. సెమీకండక్టర్లు, ఎఐ, 6జీ, ఎలక్ర్టిక్​ వాహనాలు, గ్రీన్​ హైడ్రోజన్​, పరస్పర వాణిజ్య పాలన కొత్త అవకాశాలు, అభిప్రాయాలను పంచుకున్నట్లు వివరించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా గురువారం భారత్​ కు విచ్చేశారు. శుక్రవారం రాత్రికి తిరిగి వెళ్లనున్నారు. 

 కాగా తొలిరోజు గురువారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్, రైల్వేలు, సమాచార, ప్రసారాలు, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ 2వ ఇండియా-ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చలు డిజిటల్ సహకారం, క్లీన్ ఎనర్జీ చొరవలు, వాణిజ్యం, పెట్టుబడి, సరఫరా గొలుసు స్థితిస్థాపకతలో పురోగతిని సమీక్షించాయి.