సిమ్ వినియోగదారులకు డాట్ హెచ్చరిక!
Dot warning for SIM users!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లోని 120 కోట్ల మొబైల్ వినియోగదారులకు డీవోటి (డాట్–డిపార్ట్ మెం ఆఫ్ టెలికమ్యూనికేషన్) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. జరుగుతున్న మోసాల నేపథ్యంలో తమ పేరుమీదనే సిమ్ లు ఉన్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలని తెలిపింది. ఇంటర్నెట్ వినియోగం, స్మార్ట్ ఫోన్ లు, యాప్ ల పెరుగుదల వల్ల తెలియని లింక్ ల ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. మోసాలను నివారించడానికి డాట్ చర్యలు తీసుకుంటుందని, అయినా వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. డీవోటీ వీడియోలో పలు వివరాలను పంచుకున్నామని వాటిని వీక్షించాలని తెలిపింది. సైబర్ నేరస్థులు వినియోగదారుల పత్రాలను సేకరించి వాటి ద్వారా సిమ్ కార్డులను పొందుతున్నట్లు గుర్తించామని తెలిపింది. టెలికమ్యూనికేషన్ శాఖ సంచార్ సత్తి పోర్టల్‌ను సందర్శించడం ద్వారా మీ పేరుపై నడుస్తున్న అన్ని సిమ్ కార్డుల గురించి వివరాలను మీరు సులభంగా పొందవచ్చని డీవోటి వివరించింది.