బాధ్యతాయుతమైనది హిందూ సమాజం

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​

Feb 16, 2025 - 15:49
 0
బాధ్యతాయుతమైనది హిందూ సమాజం

కోల్​ కతా: దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజమేనని, ఈ సమాజంలో ఐక్యత అత్యంత అవసరమని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ అన్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్​ లోని బర్దమాన్​ సాయి గ్రౌండ్​ లో జరిగిన ఆర్​ ఎస్​ఎస్​ కార్యక్రమంలో ప్రసంగించారు. భారత్​ కేవలం భౌగోళికం కాదన్నారు. సంఘ్​ హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించాలని, మేల్కోల్పాలని కోరుకుంటుందన్నారు. ప్రపంచంలోని వైవిధ్యాన్ని అంగీకరించడంలో హిందూ సమాజం ముందుంటుందన్నారు. భారత్​ భిన్నత్వంలో ఏకత్వమని నమ్ముతున్న దేశమని భగవత్​ చెప్పారు. చక్రవర్తులు, రాజులను గుర్తుంచుకుంటారో లేదో? తెలియదని రాముడు, భరతులను గుర్తుంచుకుంటారన్నారు. వీరు నేర్పిన విలువనే హిందూ సమాజం అనుసరిస్తుందన్నారు. ఇతరులకు హాని చేసేలా హిందూవులు ప్రవర్తించరని అన్నారు. సమాజంలోని హిందువులలో ఐక్యత అత్యవసరమని చెప్పారు. సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్​ లో సీఎం మమత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆర్​ఎస్​ఎస్​ హైకోర్టుకు వెళ్లగా కోర్టు పలు షరతులతో కూడిన అనుమతినీయడంతో సభ నిర్వహణకు ఆటంకాలు ఎదురు కాలేదు.