అక్రమ వలసదారుల్లో ఇద్దరు హత్యకేసు నిందితులు అరెస్ట్
Among the illegal immigrants, two suspects in the murder case were arrested

అమృత్ సర్: అమెరికా నుంచి భారత్ కు తిరిగొచ్చిన వారిలో ఇద్దరు హత్య కేసు నిందితులను పాటియాలా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరు 2023లో ఓ హత్య కేసులో నిందితులని ఎఫ్ ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. వీరిద్దరిపై రాజ్ పురాలో కేసు నమోదైందన్నారు. సందీప్, ప్రదీప్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. 15న రెండో విమానం అక్రమ వలసదారులతో భారత్ కు వచ్చింది. 158 మందితో కూడిన మూడో విమానం ఆదివారం రాత్రికి భారత్ కు రానుంది. తొలి విమానంలో 104, రెండో విమానంలో 120 తిరిగి రాగా మూడో విమానంలో 158 మంది రానున్నారని అధికారులు వివరించారు. అక్రమ వలసదారుల్లో అత్యధికంగా పంజాబ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందినవారున్నారు.