కేంద్రమంత్రి కూతురికి తప్పని వేధింపులు
Harassment of Union Minister's daughter

కఠిన చర్యలు తప్పవన్న సీఎం ఫడ్నవీస్
నిందితులపై పోక్సో కింద కేసు నమోదు
ముంబాయి: మహారాష్ట్రలో కేంద్ర మంత్రి కుమార్తెపై లైంగిక వేధింపుల కేసులో సీఎం ఫడ్నవీస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి రావటంతో వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఫిబ్రవరి 28న కేంద్రమంత్రి కుతూరు, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కోత్లి అనే గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడ ఏడుగురు యువకులు వారిని అసభ్యపదజాలంతో దూషిస్తూ వేధించినట్లుగా ఆదివారం జల్గాయ్ లోని ముక్తాయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వెంటనే ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు. కాగా వేధింపుల్లో ఒక పార్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఫిర్యాదులో తమతోపాటు సెక్యూరిటీ గార్డు కాలర్ పట్టుకొని బెదిరించారని మంత్రి కూతురు ఫిర్యాదులో పేర్కొంది. కాగా అరెస్ట్ అనంతరం డీఎస్పీ కుషానత్ పింగాడే మీడియాతో మాట్లాడుతూ.. వీరందరిపై పోక్సో, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.