హెచ్ ఎం ఉగ్రవాది అరెస్ట్!
పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు

లక్నో: పాక్ లో శిక్షణ పొందిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ఉల్ఫత్ హుస్సేన్ ను యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఇతన్ని మొరాదాబాద్ లో పట్టుకున్నారు. ఇతని తలపై ప్రభుత్వం రూ. 25వేల రివార్డు కూడా ప్రకటించింది. 1999–2000 మధ్య పాక్ కు వెళ్లిన ఇతను ఉగ్ర శిక్షణ తీసుకున్నాడు. తిరిగి భారత్ కు వచ్చాడు. ఇంటలిజెన్స్ సమాచారంతో కట్ఘర్ పోలీసులతో కలిసి ఏటీఎస్ నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో ఇతన్ని అరెస్టు చేశారు. ఇతను జమ్మూకశ్మీర్ నివాసి అని అధికారులు తెలిపారు. కాగా గతంలో అరెస్టు అయిన బీకేఐ ఉగ్రవాది లాజర్ తో ఇతనికి ఏవైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. లాజర్ మహాకుంభమేళాలో అలజడులు సృష్టించాలని పథకం రచించాడు. పోలీసుల అప్రమత్తంతో ఇతన్ని అరెస్టు చేయగలిగారు. ఆ దిశలో ఉల్ఫత్ హుస్సేన్ ను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.