5 కేజీల ఐఈడీ నిర్వీర్యం

5 kg IED defused

Feb 27, 2025 - 15:18
 0
5 కేజీల ఐఈడీ నిర్వీర్యం

రాయ్​ పూర్​: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో సిఆర్‌పిఎఫ్, పోలీసులు ఐదు కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సెర్చ్​ ఆపరేషన్​ సందర్భంగా నక్సలైట్లు కొంటా పోలీస్​ స్టేషన్​ ప్రాంతంలో బండా గ్రామం సమీపంలో ఈఐడీని అమర్చినట్లు గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబు, డాగ్​ స్క్వాడ్​ బృందాలు ఐఈడీని వెలికి తీసి నిర్వీర్యం చేశారు. 300మంది సీఆర్పీఎఫ్​, జిల్లా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సెర్చింగ్​ ఆపరేషన్​ లో ఈ ఐఈడీని గుర్తించి నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. నక్సల్స్​ కు వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో భద్రతా దళాలే లక్ష్యంగా పలుచోట్ల ఐడీలను అమరుస్తున్నారు. నక్సల్స్​ పాల్పడుతున్న ఈచర్యలను భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి.