కమల వికాసానికి సై

BJP Winning Delhi

Jan 12, 2025 - 13:10
Jan 12, 2025 - 17:05
 0
కమల వికాసానికి సై

29మంది అభ్యర్థులతో రెండో లిస్టు జారీ
5మంది మహిళలు, 8మంది కౌన్సిలర్లకు స్థానం
పూర్వాంచల్ నేతలకూ ప్రాధాన్యం
మాజీలకూ టిక్కెట్ల కేటాయింపుతో మరింత బలోపేతం దిశగా అడుగులు
కేజ్రీవాల్ నోరు జారుడుకు కౌంటర్ ఎటాక్ లు
ఓటింగ్ ముందే గెలుపు దిశగా బీజేపీ అడుగులు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: దేశ రాజధానిలో వికసించేందుకు కమలం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో 29మంది అభ్యర్థులతో రెండో లిస్టును కూడా జారీ చేసింది. దీంతో బీజేపీ రెండు దఫాలుగా 58 మంది అభ్యర్థులను రంగంలోకి దింపింది. ముఖ్యంగా గత మూడు రోజులుగా బీజేపీ అధిష్టానం వరుస సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ఢిల్లీ మహిళలు, పూర్వాంచల్​ నాయకులు, కార్యకర్తలు, మౌలిక సదుపాయాలు, కేజ్రీవాల్​ అవినీతి, బూత్​ స్థాయిలో పార్టీ బలోపేతం, ఓటర్లను ఆకట్టుకోవడం వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటి ఊపుమీదున్న నిర్ణయాలకు మరింత పదును పెట్టాలని కేంద్రమంత్రి జేపీ నడ్డా పార్టీ వర్గాలకు దిశా నిర్దేశం చేశారు. కమల వికాసంలో మహిళల పాత్ర కీలకం కానుండడంతో అందుకు అనుగుణంగానే బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా కేజ్రీవాల్​ ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా నోరు జారుడు ఎక్కువైంది. ఆయా విషయాలపై ఎప్పటికప్పుడు కౌంటర్​ ఇవ్వాలని కేజ్రీవాల్ నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. బూత్​ స్థాయి, గ్రామీణ స్థాయి నుంచే ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికలకు అత్యంత తక్కువ సమయం ఉండడంతో రాత్రి పగలు అనే తేడా చూడవద్దని స్పష్టం చేశారు. 

మరోవైపు బీజేపీ విడుదల చేసిన రెండో లిస్టులో ఐదుమంది మహిళలు, ఐదుమంది పూర్వాంచల్​ నాయకులు, 8మంది కౌన్సిలర్లు, ఒక మాజీ ఎంపీ, మాజీ సీఎం కుమారుడికి పార్టీ టిక్కెట్లను కేటాయిస్తూ రాజకీయ సమీకరణాలను పాటించింది. మహిళలకు టికెట్లు కేటాయించడంతో మహిళా సమీకరణంలో భారీ మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఆప్​ వైపు మళ్లిన మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని నిర్ణయించింది. దీంతోబాటు స్వాతిమాలివాల్​ పై దాడిని కూడా ఎండగట్టాలని నిర్ణయించింది. కొండ్లి నుంచి ప్రియాంక గౌతమ్​, తిలక్​ నగర్​ నుంచి శ్వేతా సైనీ, మతియా మహల్​ నుంచి దీప్తి ఇండోరా లాంటి బలమైన మహిళలను రంగంలోకి దింపింది. మాజీ సీఎం కుమారుడు హరీష్ ఖురానా, న్యూ ఢిల్లీ నుంచి పర్వేష్​ వర్మ, లక్ష్మీనగర్​ నుంచి సిట్టింగ్​ ఎమ్మెల్యే అభయ్​ వర్మ, కిరారీ నుంచి బజరంగ్​ శుక్లా, వికాస్​ పురి నుంచి పంకజ్​ సింగ్​ లాంటి పూర్వాంచల్​ బలమైన నాయకులను రంగంలోకి దింపింది. ఇటీవలే పూర్వాంచల్​ పై కేజ్రీవాల్​ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పూర్వాంచల్​ లో రాజకీయ సమీకరణాలను మార్చి మరింత బలోపేతం దిశగా బీజేపీ అడుగులు వేసిందనే చెప్పాలి. మరోవైపు బీజేపీ పార్టీకి విధేయులుగా ఉన్న కౌన్సిలర్లకు టిక్కెట్లు కేటాయించి కిందిస్థాయి కార్యకర్తల్లో మరింత బనోబలాన్ని, స్థైర్యాన్ని పెంపొందించింది. సిక్కు వర్గానికి చెందిన మాజీ మేయర్​ శ్యామ్​ శర్మను హరినగర్​ నుంచి రంగంలోకి దింపింది. 

మొత్తానికి బీజేపీ ఎక్కడా పొరపాట్లు జరగకుండా పూర్తి విజయాన్ని ఎన్నికలకు ముందే నిశ్చయం చేసుకొని ఓటింగ్​ కు వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళలు, కార్యకర్తలు, ప్రాంతాలతో కూడిన రాజకీయ సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.