ఉచిత ప్రయోజనాలు.. పనిచేసేందుకు ఇష్టపడరు: సుప్రీంకోర్టు
Free benefits.. Not willing to work: Supreme Court

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉచిత రేషన్, డబ్బులు పొందుతున్న వారు పనిచేసేందుకు ఇష్టపడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బుధవారం పట్టణ పేదరిక నిర్మూలనపై కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచితాలకు అలవాటుపడిన ప్రజలు పనికి దూరంగా ఉంటున్నారని కోర్టు పేర్కొంది. ఏ పని చేయకుండానే డబ్బులు పొందుతున్నారని, అలాంటి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే ప్రథమ ప్రాధాన్యతనీయాలని ప్రభుత్వాలకు తెలిపింది. ఎన్నికలకు ముందు చేసే ఉచిత ప్రకటనలు, రేషన్, డబ్బు అందుతుండటమే ప్రజలను పని తప్పించుకునేలా చేస్తున్నాయని తెలిపింది. ఇది దేశానికి దురదృష్టకరపరిణామంగా సంభవించే అవకాశం ఉందని చెప్పింది. దేశాభివృద్ధిలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఉంటేనే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది.