ఆరేళ్లలో 42 శాతానికి మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం

Female labor force participation to 42 percent in six years

Mar 5, 2025 - 18:41
 0
ఆరేళ్లలో 42 శాతానికి మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆరు సంవత్సరాలలో భారత మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 2017-–18లో 23శాతం నుంచి 2023–-24 నాటికి దాదాపు 42శాతానికి పెరిగిందని, ఉద్యోగ రంగంలో చేరే విద్యావంతులైన మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా బుధవారం తెలిపారు. ఉమెన్ ఇన్ సర్వీసెస్ సెక్టార్ సీఐఐ డైలాగ్ 2025లో తన ప్రసంగంలో, వ్యవసాయం, తయారీ, సేవలతో సహా వివిధ రంగాలలో ఉపాధిని కనుగొనడంలో, భారతదేశ ఆర్థిక దృశ్యంలో మహిళలు సాధించిన గణనీయమైన పురోగతిని దావ్రా హైలైట్ చేశారు. 2025–-26 కేంద్ర బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2047 నాటికి 70శాతం  మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని ఆమె పునరుద్ఘాటించారు. స్టెమ్​, వ్యవస్థాపకత, స్టార్టప్‌ల వంటి రంగాలలో మహిళల ప్రమేయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. హిమాచలో మహారాణి శైలజా కటోచ్​ ప్రాముఖ్యతను వివరించారు. ఆర్ట్​, కల్చర్​, డిజైనర్లు, క్యూరేటర్లు, వాణిజ్య రంగం, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో పలువురు ప్రముఖ మహిళల సేవలు, పనితీరును కొనియాడారు. ప్రస్తుతం దేశ మహిళలు అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం దిశగా మెరుగైన దిశలో అడుగులు వేస్తున్నారని సుమిత్రా దావ్రా సంతోషం వ్యక్తం చేశారు.