కేజ్రీకి వ్యతిరేక పవనాల సెగ
బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేక పవనాల సెగ తగులుతుంది. పంజాబ్ వెళ్లిన ఆయనపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పించాయి. బుధవారం బీజేపీ, కాంగ్రెస్ స్థానిక నేతలు మీడియాఓ మాట్లాడుతూ.. శీష్ మహల్ పై విమర్శల బాణాలు సంధించాయి. భారీ కాన్వాయ్ తో ఆయన పంజాబ్ వెళ్లడం వెనుక ఏదో మర్మం ఉందని ఆరోపించాయి. సామాన్యుడిగా మాములు కారులో తిరిగిన ఆయనకు ల్యాండ్ క్రూయిజర్ లాంటి ఖరీదైన వాహనాలు ఎక్కడివని నిలదీశాయి. పంజాబ్ ప్రభుత్వ కాన్వాయ్ లో తిరగడం ఏంటని విమర్శించాయి. ఇప్పటికే అధికారాన్ని చేజార్చుకొని ఘోరంగా విఫలమయ్యాడని విమర్శించారు. పంజాబ్ ప్రభుత్వం కేజ్రీవాల్ భద్రతకు నిధులు సమకూర్చడంపై మండిపడ్డారు. కేజ్రీవాల్ అధికార విలాసాలను వదులుకోలేకపోతున్నారని మండిపడ్డాయి.