చైనా రక్షణ బడ్జెట్​ 249 బిలియన్​ డాలర్లు

China's defense budget is 249 billion dollars

Mar 5, 2025 - 18:03
 0
చైనా రక్షణ బడ్జెట్​ 249 బిలియన్​ డాలర్లు

బీజింగ్​: చైనా 249 బిలియన్​ డాలర్ల రక్షణ బడ్జెట్​ ను ప్రకటించింది. బుధవారం 2025–26 బడ్జెట్​ లో రక్షణ శాఖకు భారత్​ కంటే మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా తమ దేశాన్ని తీర్చిదిద్దాలనే కుట్ర కోణం దాగి ఉందని అర్థమవుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 72 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో యుద్ధనౌకలు, కొత్తతరం విమానాలు, సాయుధ దళాల ఆధునీకరణ చేపడతామని, రక్షణ రంగంలో ప్రణాళికబద్ధ కేటాయింపులు చేసినట్లు ఆ దేశ ప్రధానమంత్రి లీకెకియాంగ్​ ప్రకటించారు. దీంతో అమెరికా తరువాత రక్షణ శాఖకు అత్యధికంగా బడ్జెట్​ కేటాయించిన రెండో దేశంగా చైనా నిలిచింది. అమెరికా చైనా కంటే నాలుగు రెట్లు ఎక్కువ రక్షణ బడ్జెట్​ ను కలిగి ఉంది. 

చైనా రక్షణ బడ్జెట్​ ను పెంచుకున్నా ఇందులో నష్టం లేదని, అంతర్గతంగా ఇతర రంగాలపై ఈ ప్రభావం పడి ఆర్థిక వ్యవస్థకు శరాఘాతంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే చైనా రియల్​ రంగంతోపాటు అమెరికాతో పేచీ, పాక్​ లో పలు ప్రాజెక్టులపై నీలినీడలు తదితర సమస్యలు చైనా ఆర్థిక రంగంపై పెనుభారంగా మారాయి. మరోవైపు పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని అమెరికా ప్రకటిస్తుండడంతో ఇదే జరిగితే చైనా మరింత ఆర్థిక అగాధంలోకి కూరుకుపోక తప్పదనే వాదనలూ ఉన్నాయి.