కాంగ్రెస్ కు చుక్కలు
Dots to Congress

అధికార రాష్ట్రాల్లో అప్రతిష్ఠ
చేయి కలిపేది లేదంటున్న కూటమి పార్టీలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా దిగజారింది. దీంతోపాటు ఇండికూటమిలో మరోమారు కలిసి పోటీ చేయలేని విచ్ఛిన్నాలు ఏర్పడ్డాయి. బీజేపీని ఓడించాలనే ఒక ఒక ఉద్దేశ్యంతో ఏకమైన కాంగ్రెస్, మిత్ర పక్షాలకు దేశ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడంతో ప్రస్తుతం ఆ పార్టీల భవితవ్యం కూడా అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం పది రాష్ట్రాల్లోకాంగ్రెస్ పార్టీకి గుండుసున్నానే మిగిలింది. అధికారంలో ఉన్న మూడు రాష్ర్టాల్లోనూ తన పాలన వల్ల అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. దేశానికి గుండెకాయలైన రాష్ట్రాలు మహారాష్ట్ర, న్యూ ఢిల్లీలో కాంగ్రెస్, మిత్రపక్షాలకు ఘోర ఓటమి తప్పలేదు. ఈ రెండు రాష్ర్టాల్లోనూ వార్ వన్ సైడ్ అన్నట్లుగా బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు కనిపించాయి.
ఇక మిగిలింది. బిహార్, దక్షిణ రాష్ట్రాలు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోం. అసోం, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ దాని అఖిల భారత కూటమి భాగస్వాములతో పోలిస్తే ప్రధాన పాత్రధారి, కాబట్టి అక్కడ సీట్ల పంపకంలో ఎటువంటి సమస్య ఉండదని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తో వెళ్లే పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుండడంతో ఇక్కడ హస్తానికి రిక్తహస్తమే ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇక తమిళనాడులో కాంగ్రెస్ కు ప్రధాన భాగస్వామిగా భావిస్తున్న పార్టీ డీఎంకే. గత ఎన్నికల్లో స్థిరంగానే వీరి మధ్య సంబంధాలున్నా, వచ్చే ఎన్నికల నాటికి డీఎంకే సొంతంగానే పోటీ చేయాలని భావిస్తుంది. మరోవైపు బీజేపీ తమిళనాడులో తమ గ్రాఫ్ పెంచుకునే దిశగా చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్ గత ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా. ప్రస్తుతం స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు బీజేపీ వైపే మొగ్గు చూపుతుండడంతో గతంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం మమత బెనర్జీ ప్రస్తుతం వార్తల్లో కూడా గమనించడం లేదు. ఇందుకు కారణం తమ పార్టీ ప్రాబల్యం తగ్గడమేననే రాజకీయ విశ్లేషకుల వాదన. సీఎం మమత కేంద్రంపై ఎంతగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా ఆమెకు నెగిటివ్ గానే నిలిచే అవకాశం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ కలిసి నడవొద్దని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై కూడా పెద్దగా విమర్శలు చేయడం లేదు. కాగా పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తక్కువ స్థానాలు గెలుచుకున్నా 37 శాతం ఓటు బ్యాంకు షేర్ ను సాధించింది. గతంలో ఢిల్లీలోనూ ఓటు బ్యాంకు షేర్ ఎక్కువగా ఉన్న తక్కువ సీట్లను సాధించింది. అదీ కాస్త ప్రస్తుతం 52 శాతానికి పైగా పెరిగతి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది.
కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల తరువాత ఈ రాష్ట్రంలో బీజేపీ ఉనికి బాగా పెరిగింది. పైగా దక్షిణాది యోగిగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ ను ఇక్కడి నుంచి భారీ ఎత్తున రంగంలోకి దింపాలని కేంద్రం భావిస్తుంది. ఈయనకు సినీ క్రేజ్ తోపాటు, రాజకీయ క్రేజ్, సనాతన ధర్మం, ముఖ్యంగా యూత్ ఫాలోయింగ్ పెద్దగా ఉండడంతో బీజేపీ ఫార్మూలా ఇక్కడ సాధ్యపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డుకాలంగా కనిపిస్తుంది.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా భావిస్తున్న తెలంగాణ ప్రాంతంలోనూ కాంగ్రెస్ కు ఎదురుపవనాలే వీస్తున్నాయి. వచ్చి రాగానే బీఆర్ఎస్ పై కోపంతో హైడ్రా పేరుతో కూల్చివేతలే ఆ పార్టీని పూర్తిగా అప్రతిష్ఠపాలు చేశాయి. దీంతో ప్రజల్లో భారీ వ్యతిరేకత వచ్చింది. పైగా వందరోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలను కాస్త 15 నెలలు గడుస్తున్నా చక్కదిద్దే పరిస్థితి లేదు. మూడుసార్లు ప్రజాపాలన అని, గ్రామ పాలన అని దరఖాస్తులను తీసుకొని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నమే చేశారు. కనీసం రేషన్ కార్డులు కూడా ఇన్ని నెలల్లో ఇవ్వలేని చేతగాని ప్రభుత్వంగా పేరు మూటగట్టుకుంది. బీఆర్ఎస్ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అర్హులందరికీ రేషన్ కార్డులు అందించలేకపోయారు. పైగా వరదల సమయంలో తన పార్టీ అనుయాయూలకే ప్రాధాన్యతనిస్తూ వారికే రూ. 10వేలు అప్పజెప్పారు. ఈ వ్యతిరేకతలన్నీ ఆయన ఓటమికి కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దిగాలంటేనే అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఏదో అధికారంలో ఉన్నామే తప్ప చేసేదేం లేదన్నట్లు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఉంది. దీనికి తోడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పట్టు బిగించే ప్రచారాలకు తెరతీశారు. దీంతో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు రానున్న కాలం గడ్డుకాలంగానే నిలవనుంది. ఈ రెండు పార్టీల పాలనను అణువణువునా పరీక్షించిన తెలంగాణ ప్రజలు ఒకమారు బీజేపీకి పాలన అందించాలనే దిశగా ఆశగా ఎదురు చూస్తున్నారు.