సంభాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ!
Bhumi Puja for construction of Sambhal Police Station!

లక్నో: యూపీ సంభాల్ లోని పోలీస్ స్టేషన్ కు భూమి పూజ నిర్వహించారు. శుక్రవారమే అడిషనల్ సూపరింటెండెంట్, ఎస్పీలు కలిసి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. శనివారం భూమిపూజ నిర్వహించారు. మసీదు ముందే ఖాళీ స్థలాన్ని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఎంచుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్థలంలో తవ్వకాలు చేపట్టారు. ఉదయమే వేద బ్రహ్మణుల చేత శాస్ర్తోక్తంగా భూమి పూజ నిర్వహించారు. పూజ అనంతరమే పనులకు ఉపక్రమించనున్నట్లు అడిషనల్ సూపరింటెండెంట్ శ్రీశ్చంద్ర తెలిపారు. పోలీస్ స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో భద్రతా వ్యవస్థ మరింత పటిష్ఠం అవుతుందన్నారు. సంభాల్ అల్లర్ల తరువాత ఈ ప్రాంతంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. కాగా సంభాల్ లో ఉన్న చారిత్రక పురాతన మందిరాలు, బావులు వెలుగుచూస్తున్నాయి. వీటిని వెలికితీసే పనులను ఎఎస్ ఐ చేపట్టింది.