ఫ్లాట్​ గా ముగిసిన దేశీయ మార్కెట్లు

Domestic markets ended flat

Feb 1, 2025 - 17:00
 0
ఫ్లాట్​ గా ముగిసిన దేశీయ మార్కెట్లు

ప్రారంభంలో ఎగిసి, ముగింపు దశలో కిందకు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2025–26 బడ్జెట్​ నేపథ్యంలో శనివారం భారతీయ స్టాక్​ మార్కెట్లు ప్రత్యేక ట్రేడింగ్​ ను కొనసాగించాయి. తొలుత  లాభాల్లో ఉన్న మార్కెట్లు కాస్త చివరిలో ఫ్లాట్​ గా ముగిశాయి. ఉదయం నుంచి బడ్జెట్​ ప్రకటనలు, వర్తల నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​ ప్రారంభం కాగానే 12గంటల వరకు భారీ లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్​ 125.66 పాయింట్లు ఎగిసిపడగా, నిఫ్ట 23 పాయింట్ల వృద్ధిని సాధించింది. చివరకు సెన్సెక్స్​ ఐదు పాయింట్ల పెరుగుదల, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం, బీఎస్​ ఇ మిడ్​ క్యాప 212 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్​ ఐదు పాయింట్ల లాభంతో 77,505 వద్ద ముగియగా, నిఫ్టీ 26 పాయింట్లు పతనమై 23, 482 వద్ద ముగిసింది. బీఎస్​ఈ మిడ్​ క్యాప్​ 212 పాయింట్ల పతనంతో 42,884 వద్ద ముగిసింది. సెన్సెక్స్​ లో 16 షేర్లు లాభాల్లో ట్రేడ్​ కాగా, 14 షేర్లు నష్టాలను కూడగట్టుకున్నాయి. 50 నిఫ్టీలో 29 షేర్లు క్షీణించగా, 22 పెరిగాయి. అదే సమయంలో రియాల్టీ రంగం షేర్లు 3.38 శాతం పెరిగాయి. ఎఫ్​ ఎంసిజ 3.01శాతం, ఆటో రంగం 1.91 శాతం పెరుగుదల నమోదైంది. బ్యాంకింగ్​ 1.59 శాతం, ఆయిల్​ అండ్​ గ్యాస్​ 1.59 శాతం, ఐటీ రంగం 1.48 శాతం క్షీణించాయి. విదేశీ పెట్టుబడిదారులు రూ. 1,188.99 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ పెట్టుబడిదారులు రూ. 2,232.22 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. జనవరి 31తో పోల్చుకుంటే షేర్​ మార్కెట్లు ఫ్లాట్​ గా ముగిసాయనే చెప్పొచ్చు.