భారత్​–ఖతార్​ మధ్య లోతైన బంధాలు

Deep ties between India and Qatar

Feb 18, 2025 - 12:14
 0
భారత్​–ఖతార్​ మధ్య లోతైన బంధాలు

ప్రధాని మోదీ, రాష్ర్టపతి ముర్మూలతో ఖతార్​ షేక్​ తమీమ్​ భేటీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ భారత్​–ఖతార్​ మధ్య నమ్మకం, మరింత లోతైన చారిత్రక సంబంధాలు అవసరమని ఇరుదేశాల విదేశాంగ శాఖలు పేర్కొన్నాయి. సోమవారం రాత్రి భారత్​ కు వచ్చిన ఖతార్​ఎమిర్​ షేక్​ తమీమ్​ బిన్​ హమద్​ అల్​ థానీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం ప్రధాని మోదీ, రాష్ర్టపతి ద్రౌపదీ మూర్ములు షేక్​ తమీమ్​ ను రాష్ర్టపతి భవన్​ లో స్వాగతించారు. ఇటీవలి సంవత్సరాలలో రెండు దేశాల మధ్య సంబంధాలు - ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, సంస్కృతి, పీ2పీ (ప్రజల నుంచి ప్రజలు) సంబంధాలు బలోపేతం అయ్యాయి. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు షేక్​ తమీమ్​ భారత్​ లో పర్యటించడం ఇది రెండోసారి. రాష్ర్టపతి భవన్​ లో పలువురు మంత్రులు,ప్రతినిధులను షేక్​ తమీమ్​ కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్​ హౌస్​ లో ప్రధానితో ద్వైపాక్షిక సమావేశం, అనంతరం ఎంవోలపై సంతకాలు చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ర్టపతి భవన్​ లో మరోమారు ద్రౌపదీ ముర్మూతో కలిసి గౌరవార్థం ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం ఖతార్​ వెళ్లనున్నారు.