బడ్జెట్ లో విపక్షాల గందరగోళం
Confusion of the opposition in the budget

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా 2025–26 బడ్జెట్ కు ముందే చర్చ జరగాలని, పలు విషయాలపై చర్చించాలని కాంగ్రెస్, ఎస్పీ సహా విపక్షాలు శనివారం బడ్జెట్ సమావేశం ప్రారంభం కాగానే గందరగోళం సృష్టించే ప్రయత్నాలకు తెరతీశాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా అఖిలేష్ యాదవ్ ను ఉద్దేశిస్తూ బడ్జెట్ ప్రసంగం విన్న తరువాత అవకాశం ఇస్తామని విషయాలపై చర్చించాలని మందలించారు. అయినా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదువుతుండగా విపక్షాలు అరుపులు ఆగలేదు.