పాట్నా యూనివర్సిటీలో బాంబుదాడి!

Bomb attack in Patna University!

Mar 5, 2025 - 17:37
 0
పాట్నా యూనివర్సిటీలో బాంబుదాడి!

పాట్నా: పాట్నా విశ్వవిద్యాలయంలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ కాస్త బాంబుపేలుళ్లకు దారి తీసింది. బుధవారం ప్రొఫెసర్​ లక్ష్మీనారాయణ్​ కారుపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడులకు పాల్పడడంతో ఒక్కసారిగా క్యాంపస్​ లో తీవ్ర కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎస్పీ దీక్ష సంఘటనా స్థలానికి చేరుకొని పలువురు విద్యార్థులు, ప్రొఫెసర్లను విచారించారు. దాడికి కారణలపై అన్వేషణ మొదలు పెట్టారు. బాంబుదాడితో ఒక్కసారిగా విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున శబ్ధాలు విద్యార్థులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశాయి. కాగా మార్చి 29న విద్యార్థి సంఘం ఎన్నికలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి వారి మధ్య ఘర్షణ జరుగుతుందని ప్రొఫెసర్లు పోలీసులకు వివరించారు. దాడిచేసిన వారెవ్వరైనా వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ దీక్షా తెలిపారు.